Thursday, February 9, 2017

               పెళ్లైనా అది మాత్రం మానను.. 


సినిమా పిల్లర్- దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోను వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శృతి హాసన్. ఈ భామ హీరో సూర్యతో కలసి నటించిన ఎస్ 3 రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.
తన మనసుకు అనిపించింది భయం లేకుండా చేస్తానని, ఎదుటివారి నుంచి ప్రశంసలు ఆశించకుంటే విమర్శలను, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు అని చెప్పింది. అలాగే తనకు పెళ్లి అయినా కూడా సినిమాల్లో నటిస్తానని, నటన కూడా ఓ వృత్తి లాంటిదే అని తెలిపింది. భర్త చెప్పాడనో, అత్త నో అందనో నటనను త్యాగం చేయకూడదని అభిప్రాయపడింది. తనకు పెళ్లైనా, తాను పిల్లల తల్లైనా కూడా నటిస్తానని, నటన అంటే తనకు అమితమైన ఇష్టమని చెప్పిందీ సొగసరి జాన.


Tuesday, February 7, 2017

                       ఈ భామను గొల్టెన్ లెగ్ అంటున్నారు..


సినిమా పిల్లర్- ఒకప్పుడు అందాల చందమామ కాజల్ ను, ఆ తర్వాత సమంతలను సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ లేగ్ అని పిలిచేవారు. వారు ఏ సినిమా చేస్తే అది హిట్ అయ్యేది. ఇప్పుడు ఆ ఇమేజ్ మళయాల భామ కీర్తి సురేష్ పొందింది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. త్వరలో పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించే చాన్స్ కొట్టేసింది ఈ నెరజాన.
ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే ఈ కీర్తి ఖాతాలో హ్యాట్రిక్ పడినట్లే. ప్రస్తుతం నేను లోకల్ సినిమా థియేటర్లలో స్టడీగా ఆడుతుంది. ఈ సినిమా దాదాపు ఇప్పటివరకు 22 కోట్ల షేర్ రాబట్టిందని అంటున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకెంత వసూలు చేస్తుందనే విషయం ఈరోజు నుంచి వీకెండ్ వచ్చేలోపు తేలిపోతుంది. నిజంగా సినిమా జెన్యూన్ హిట్ అయితే, ఈ వీకెండ్ కూడా ఆడుతుంది. ఇంకేముంది కూర్తి సురేష్ ఏ సినిమలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అన్న పేరు మాత్రం వచ్చేసింది.


                         బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయింది..


సినిమా పిల్లర్- బాలీవుడ్ లో ఈ మద్య పెద్దల చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.  ఇలాంటి సినిమాలు బాలీవుడ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.  ప్రధానంగా బి గ్రెడ్ హీరోయిన్లు, మోడల్స్ అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  ఇక హాలీవుడ్ సెక్టీ భామ సన్నిలియోన్ ‘జిస్మ్ 2’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది.  కేవలం రెండు సంవత్సాల్లోనే భారత దేశ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా గుగుల్ లో స్థానం కొట్టేసింది.          
భారత్ లో ఎక్కువ శాతం నెటిజన్లు ఈ అమ్మడిని సినిమాలు, వీడియోలు మరీ టూమచ్ గా చూస్తున్నారట. ఫోర్న్ ప్రపంచం నుంచి వచ్చిన నటి అయినందున ఏ మాత్రం సిగ్గూ బియాలకు పోకుండా విచ్చలవిడి శృంగార పాత్రల్లో నటిస్తూ..కుర్రకారు మతి పోగొడుతోంది.  ఆ మద్య తన అనుభవాల గురించి చెబుతూ .... టీనేజ్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సడెన్ గా సన్నీ లియోన్ ఫాదర్ వచ్చాడట.. దాంతో రెడ్ హ్యాండెడ్ గా తండ్రి కి దొరికిపోయిందట సన్నీ లియోన్.  అయితే ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పుడు చాలా అవమానంగా, సిగ్గుగా అనిపిస్తుందని చెప్పిందీ భామ.


Saturday, January 28, 2017

              ఆమె ఆయన్నే నమ్ముకుందట..


సినిమా పిల్లర్- అందాల భామ రేజీనా హీరోయిన్ గా పరిచయమై ఐదేళ్ళు అవుతున్నా... తన తదుపరి స్థానం ఏంటి అనే అయోమయంలో ఉంటూ వస్తోంది. మంచి నటన టాలెంట్ ఉన్నా ఈ అమ్మడి ఫేట్ మాత్రం మారడం లేదు. ఆమె తర్వాత వచ్చిన కీర్తి సురేష్ , రకుల్ ప్రీత్ సింగ్ వంటి యంగ్ హీరోయిన్లు అవకాశాలతో దూసుకుపోతుంటే...రేజీనా మాత్రం అవకాశాల వేటలో వేనుకబడిందని చెప్పకతప్పదు.
ఇక ప్రస్తుతం రెజీనా ఒకే ఒక్క సినిమా లో నటిస్తోంది. ఆ సినిమానే తన కెరీర్ ని టర్న్ చేస్తుందని నమ్ముతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న చిత్రం నక్షత్రం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కృష్ణవంశీ ఈ సినిమాతో తనకు బ్రేక్ ఇస్తాడని నమ్మకంగా ఉందీ భామ. హీరోయిన్లని గ్లామర్ గా చూపించడంలో ఈ దర్శకుడు స్పెషలిస్ట్ కదా మరి.
ఇక ఈ సినిమాలో రేజీనాను కూడా కృష్ణవంశీ అద్భుతంగా ఎలివేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నక్షత్రంలో జమునారాణి క్యారెక్టర్‌ చేస్తున్న రెజీనా గ్లామర్ పరంగా కూడా హద్దులు లేకుండా రెచ్చిపోయినట్లు సమాచారం. మరి మూవీ హిట్టు అయితే కానీ నెరజానకు తెలుగులో ఛాన్స్ లు రావనేది అందరికి తెలిసిన విషయమే. మరి ఏ మేరకు కృష్ణవంశీ రెజీనా తలరాతను మారుస్తాడో చూడాలి మరి.


             కేవలం ఐదు నిమిషాల ఆనందం..


సినిమా పిల్లర్- చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని చెబుతోంది అందాల భామ నయనతార. గత రెండేళ్లుగా కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నానని అంటోంది. కమర్షియల్ పంధాకు భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాల్ని దక్కించుకుంది అమ్మడు.
ఇక కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని, అభిమానుల ప్రేమతో పాటు కష్టపడేతత్వమే తిరిగి తనని నిలదోక్కుకునేలా చేసిందని చెప్పుకొచ్చింది. ప్రతి విజయం తన బాధ్యతని మరింత పెంచుతుందని తెలిపింది. బాలీవుడ్ తో పోల్చితే దక్షినాదిలో మహిళా ప్రాధాన్యతా చిత్రాలకు ఆదరణ తక్కువేనన్న నయన్... ఈ ధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడింది.
ఇక అందరు వెళ్లే దారిలో కాకుండా ప్రతి సినిమాలో నన్ను నేను వైవిధ్యంగా ఆవిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తానని అంది కేరళ కుట్టి. ప్రయోగాలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడతానని.. ఓ సినిమా విజయం తాలూకు ఆనందం నాలో ఐదు నిమిషాలకు మించి ఉండదని చెప్పింది. తదుపరి సినిమాలో ప్రేక్షకులను మరింతగా అలరించడానికి కొత్తగా ఏం చేయాలా అనే భయం ఎక్కువగా ఉంటుంది. అదే నన్ను మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణనిస్తుంది అని తెలిపింది.



Friday, January 27, 2017

             బాహుబబలి-2 పోస్టర్ విడుదల..



సినిమా పిల్లర్- దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్తాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి-2 సినిమాపై అందరి అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో సినిమా పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రభాస్ అనుష్క విల్లు ఎక్కుపెట్టిన ఈ పోస్టర్ అందరికి ఆకట్టుకుంటోంది.


             అలాంటి రొమాన్స్ నాకూ కావాలి...



సినిమా పిల్లర్-  చిన్నప్పుడు ప్రేమ కథల గురించి నాన్న చెబుతుంటే చాలా ఆసక్తిగా ఉండేది. అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్ లో పెద్దవారికి తెలియకుండా మాట్లాడటం...రోజుకో ప్రేమలేఖ రాసుకోవడం వంటివి చేసేవారట. ఇవన్ని నాన్న కథలు కథలుగా చెబుతుంటే....నాకు కూడా అటువంటి రోమాన్స్ చేయాలనీ అనిపిస్తోందని చెప్పింది కమల్ హసన్ కూతురు శృతి హాసన్. 
ఇక ఇప్పుడు సెల్ ఫోన్స్, వాట్స్ అప్, చాటింగ్ లతో ఎంత త్వరగా ప్రేమ పుడుతుందో...అంతే త్వరగా బ్రేకప్ అయిపోతుంది. దీనికి కారణం ఒకరినొకరు చూసుకోకుండా....ఒకరినొకరు నేరుగా మాట్లాడకుండా ఫోన్ లోనే ప్రేమించుకోవడమే ఇందుకు కారణం అని అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది కమల్ హాసన్ గారాల పట్టి శృతి.