Saturday, January 28, 2017

             కేవలం ఐదు నిమిషాల ఆనందం..


సినిమా పిల్లర్- చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని చెబుతోంది అందాల భామ నయనతార. గత రెండేళ్లుగా కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నానని అంటోంది. కమర్షియల్ పంధాకు భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాల్ని దక్కించుకుంది అమ్మడు.
ఇక కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని, అభిమానుల ప్రేమతో పాటు కష్టపడేతత్వమే తిరిగి తనని నిలదోక్కుకునేలా చేసిందని చెప్పుకొచ్చింది. ప్రతి విజయం తన బాధ్యతని మరింత పెంచుతుందని తెలిపింది. బాలీవుడ్ తో పోల్చితే దక్షినాదిలో మహిళా ప్రాధాన్యతా చిత్రాలకు ఆదరణ తక్కువేనన్న నయన్... ఈ ధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడింది.
ఇక అందరు వెళ్లే దారిలో కాకుండా ప్రతి సినిమాలో నన్ను నేను వైవిధ్యంగా ఆవిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తానని అంది కేరళ కుట్టి. ప్రయోగాలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడతానని.. ఓ సినిమా విజయం తాలూకు ఆనందం నాలో ఐదు నిమిషాలకు మించి ఉండదని చెప్పింది. తదుపరి సినిమాలో ప్రేక్షకులను మరింతగా అలరించడానికి కొత్తగా ఏం చేయాలా అనే భయం ఎక్కువగా ఉంటుంది. అదే నన్ను మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణనిస్తుంది అని తెలిపింది.



No comments:

Post a Comment