Saturday, January 28, 2017

              ఆమె ఆయన్నే నమ్ముకుందట..


సినిమా పిల్లర్- అందాల భామ రేజీనా హీరోయిన్ గా పరిచయమై ఐదేళ్ళు అవుతున్నా... తన తదుపరి స్థానం ఏంటి అనే అయోమయంలో ఉంటూ వస్తోంది. మంచి నటన టాలెంట్ ఉన్నా ఈ అమ్మడి ఫేట్ మాత్రం మారడం లేదు. ఆమె తర్వాత వచ్చిన కీర్తి సురేష్ , రకుల్ ప్రీత్ సింగ్ వంటి యంగ్ హీరోయిన్లు అవకాశాలతో దూసుకుపోతుంటే...రేజీనా మాత్రం అవకాశాల వేటలో వేనుకబడిందని చెప్పకతప్పదు.
ఇక ప్రస్తుతం రెజీనా ఒకే ఒక్క సినిమా లో నటిస్తోంది. ఆ సినిమానే తన కెరీర్ ని టర్న్ చేస్తుందని నమ్ముతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న చిత్రం నక్షత్రం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కృష్ణవంశీ ఈ సినిమాతో తనకు బ్రేక్ ఇస్తాడని నమ్మకంగా ఉందీ భామ. హీరోయిన్లని గ్లామర్ గా చూపించడంలో ఈ దర్శకుడు స్పెషలిస్ట్ కదా మరి.
ఇక ఈ సినిమాలో రేజీనాను కూడా కృష్ణవంశీ అద్భుతంగా ఎలివేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నక్షత్రంలో జమునారాణి క్యారెక్టర్‌ చేస్తున్న రెజీనా గ్లామర్ పరంగా కూడా హద్దులు లేకుండా రెచ్చిపోయినట్లు సమాచారం. మరి మూవీ హిట్టు అయితే కానీ నెరజానకు తెలుగులో ఛాన్స్ లు రావనేది అందరికి తెలిసిన విషయమే. మరి ఏ మేరకు కృష్ణవంశీ రెజీనా తలరాతను మారుస్తాడో చూడాలి మరి.


             కేవలం ఐదు నిమిషాల ఆనందం..


సినిమా పిల్లర్- చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని చెబుతోంది అందాల భామ నయనతార. గత రెండేళ్లుగా కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నానని అంటోంది. కమర్షియల్ పంధాకు భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాల్ని దక్కించుకుంది అమ్మడు.
ఇక కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని, అభిమానుల ప్రేమతో పాటు కష్టపడేతత్వమే తిరిగి తనని నిలదోక్కుకునేలా చేసిందని చెప్పుకొచ్చింది. ప్రతి విజయం తన బాధ్యతని మరింత పెంచుతుందని తెలిపింది. బాలీవుడ్ తో పోల్చితే దక్షినాదిలో మహిళా ప్రాధాన్యతా చిత్రాలకు ఆదరణ తక్కువేనన్న నయన్... ఈ ధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడింది.
ఇక అందరు వెళ్లే దారిలో కాకుండా ప్రతి సినిమాలో నన్ను నేను వైవిధ్యంగా ఆవిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తానని అంది కేరళ కుట్టి. ప్రయోగాలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడతానని.. ఓ సినిమా విజయం తాలూకు ఆనందం నాలో ఐదు నిమిషాలకు మించి ఉండదని చెప్పింది. తదుపరి సినిమాలో ప్రేక్షకులను మరింతగా అలరించడానికి కొత్తగా ఏం చేయాలా అనే భయం ఎక్కువగా ఉంటుంది. అదే నన్ను మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణనిస్తుంది అని తెలిపింది.



Friday, January 27, 2017

             బాహుబబలి-2 పోస్టర్ విడుదల..



సినిమా పిల్లర్- దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్తాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి-2 సినిమాపై అందరి అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో సినిమా పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రభాస్ అనుష్క విల్లు ఎక్కుపెట్టిన ఈ పోస్టర్ అందరికి ఆకట్టుకుంటోంది.


             అలాంటి రొమాన్స్ నాకూ కావాలి...



సినిమా పిల్లర్-  చిన్నప్పుడు ప్రేమ కథల గురించి నాన్న చెబుతుంటే చాలా ఆసక్తిగా ఉండేది. అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్ లో పెద్దవారికి తెలియకుండా మాట్లాడటం...రోజుకో ప్రేమలేఖ రాసుకోవడం వంటివి చేసేవారట. ఇవన్ని నాన్న కథలు కథలుగా చెబుతుంటే....నాకు కూడా అటువంటి రోమాన్స్ చేయాలనీ అనిపిస్తోందని చెప్పింది కమల్ హసన్ కూతురు శృతి హాసన్. 
ఇక ఇప్పుడు సెల్ ఫోన్స్, వాట్స్ అప్, చాటింగ్ లతో ఎంత త్వరగా ప్రేమ పుడుతుందో...అంతే త్వరగా బ్రేకప్ అయిపోతుంది. దీనికి కారణం ఒకరినొకరు చూసుకోకుండా....ఒకరినొకరు నేరుగా మాట్లాడకుండా ఫోన్ లోనే ప్రేమించుకోవడమే ఇందుకు కారణం అని అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది కమల్ హాసన్ గారాల పట్టి శృతి. 


Saturday, January 7, 2017

                                           చరణ్.. మా వదిన నిర్మాణంలో సినిమా..




సినిమా పిల్లర్- ఎట్టకేలకు అన్న సినిమాపై తమ్ముడు స్పందించాడు.. అదేనండి చిరంజీవి ఖైదీ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. ఇప్పటి వరకు మెగాస్టార్ రీ ఎంట్రీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవన్ తాజాగా ఖైదీ నంబర్ 150 యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపాడు. చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనస్పూర్తిగా శుభాకాంక్షలు'. అంటూ ట్వీట్ చేశాడు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమా వేడుకకు తాను వచ్చేదీ రానిదీ క్లారిటీ ఇవ్వలేదు. నిన్న సాయంత్రం నుంచి పవన్ ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ స్వయంగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారంటున్నారు అభిమానులు. పనవ్ మాత్రం తన ట్వీట్ లో ఎక్కడా వేడుకకు సంబంధించి స్పందించకపోవటంతో మరోసారి అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
Tags: pawan tweet about khaidi, pawan tweet about khaidi movie, pawan tweet about khaidi 150, pawan tweet about khaidi cinema, Power star pics, megastar pics, pavan kalyan, chiranjeevi, chiranjeevi 150 movie, pavan kalyan movies, khaidi no 150, khaidi no 150 movie.

http://www.newspillar.com/post/pawan-tweet-about-khaidi
                                                ఒకే కధ కోసం ఇద్దరు పోటీ..



సినిమా పిల్లర్- నందమూరి బాలకృష్ణ.. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల తరువాత ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి విడుదల కానున్న ఈ రెండు చిత్రాలపై ఈ ఇద్ద‌రు అగ్ర హీరోల ఫ్యాన్స్‌ తో పాటు టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో సైతం భారీ అంచ‌నాలు ఉన్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ఇక్క‌డితోనే కాదు వీరి నెక్ట్స్ సినిమా విష‌యంలో కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ త‌న రీ ఎంట్రీ మూవీ కోసం ముందుగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి స్టోరీని తెర‌కెక్కించాడు. ఈ టైటిల్‌ తో స్టోరీ లైన్ రెడీ చేయాల‌ని పరుచూరి సోదరులను కోరాడట. ప‌రుచూరి సోద‌రులు మంచి స్క్రిఫ్ట్ రెడీ చేశారు కూడా..అయితే కీల‌క సినిమా కోసం కొత్త క‌థ‌..అది హిస్టారిక‌ల్ స్టోరీతో రిస్క్ చేయ‌డం ఎందుక‌నుకున్న చిరు చివ‌ర‌కు కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమా రీమేక్‌ కు ఓకేచేశాడు.
ఇక బాల‌య్య హిస్టారిక‌ల్ మూవీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స్టోరీతో త‌న 100వ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు అటు చిరు త‌న 151వ సినిమా కోసం ఏదైనా కొత్త‌గా ట్రై చేయాల‌ని అనుకుంటుంటే…. ఇటు బాల‌య్య సైతం త‌న 101వ సినిమాను అదే స్టోరీతో చేయాల‌ని డిసైడ్ అయ్యి ప‌రుచూరి సోద‌రుల‌తో చ‌ర్చించాడ‌ట‌. ఈ విష‌యం చిరుకు తెలియ‌డంతో తాను ఎంతో ఇష్ట‌ప‌డి రాయించుకున్న క‌థ‌ను బాల‌య్య‌కు ఇవ్వ‌వ‌ద్ద‌ని వారిని రిక్వెస్ట్ చేశాడని సమాచారం. 
ఇంకేముంది అటు చిరు , ఇటు బాల‌య్య మ‌ధ్య‌లో ప‌రుచూరి సోద‌రులు న‌లిగిపోతున్నార‌ట‌. మ‌రి ఒకే క‌థ‌కోసం పోటీప‌డుతున్న ఈ టాలీవుడ్ అగ్ర‌హీరోల్లో ఎవ‌రు ఫైన‌ల్‌ గా ఈ క‌థ‌ను సొంతం చేసుకుంటారన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది


Friday, January 6, 2017

                                        బాహుబలి షూటింగ్ నుంచి రిలీఫ్ అయిన ప్రభాస్ 

సినిమా పిల్లర్ : ఏదైనా సినిమా షూటింగ్ జరిగితే మూనెల్లో, ఆర్నెల్లో జరుగుతుంది. కాని ప్రభాస్ ఒకే సినిమాను మూడున్నరేళ్లుగా నటిస్తున్నాడు. అదే బాహుబలి ప్రాజెక్టు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడున్నారేళ్లు కస్టపడిన ప్రభాస్ ఇప్పుడు రిలీఫ్ అయ్యాడు. ఈవిషయాన్ని బాహుబలి దర్శకుడు రాజమౌళి సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. బాహుబలి షూటింగ్ పూర్తి అయ్యిందని మూడున్నర సంవత్సరాల పాటు ప్రభాస్‌తో జర్నీ కొనసాగింది అంటూ జక్కన్న పోస్ట్‌ చేశాడు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రభాస్‌ పడ్డ కష్టం ముందు అందరిది కూడా తక్కువే అని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్‌ కొన్ని వారాలు రెస్ట్‌ తీసుకుని తర్వాత ప్రాజెక్ట్‌తో బిజీ అవ్వనున్నాడు. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ చేపట్టిన ఏకైక ప్రాజెక్టు బాహుబలి మాత్రమే.

Tags: bhahubali shooting over, Prabas releave from bhahubali project, rajamowly shooting over, prabas movies, prabas pics, prabas images, prabas photos.

http://www.newspillar.com/post/bhahubali-shooting-over
                                                     తమన్నా పెళ్లి చూపులు..

సినిమా పిల్లర్- తెలుగులో గత యేడాది విడుదలైన సినిమాల్లో 'పెళ్లి చూపులు' చిత్రం చిన్న బడ్జెట్ తో రూపొందించబడింది. ఈ చిత్రానికి ఖర్చుపెట్టిన దానికంటే 20% ఎక్కువ లాభాలను ఆర్జించిపెట్టింది ఈ చిత్ర రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ లో  , తమిళ్ లో టాప్ ఫిలిం మేకర్స్ సొంతం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళ రీమేక్ 'పెళ్లి చూపులు' చిత్రం లో తమన్నా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. తెలుగు లో రీతూ వర్మ పోషించిన పాత్రలో తమిళ్ లో తమన్నా నటిస్తోంది . సెంథిల్ వీరస్వామి దర్శకత్వం లో , గౌతమ్ మీనన్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ఒరిజినల్ చిత్రం లోని  విజయ్ దేవరకొండ రోల్ లో నటించేందుకు నటుడు కోసం అన్వేషిస్తున్నారట.

Tags: tamanna in pellichupulu , actress tamanna in pellichupulu , tamanna in pellichupulu movie, tamanna in pellichupulu film, tamanna hd hot pics, tamanna pics, tamanna images, tamanna videos,
tamanna movies.

http://www.newspillar.com/post/tamanna-in-pellichupulu

Tuesday, January 3, 2017

                                      రొమాన్స్ చేస్తే తప్పేంటంటున్న కమల్ కూతురు..



సినిమా పిల్లర్- తమిళ  స్టార్ కమల్ హసన్  కూతురు అయినా..సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరి నటిస్తోంది ఆయన గారాల పట్టి శృతిహాసన్. ఒక్క సినిమాలోనే కాదు ఈవెంట్స్, మ్యాగజైన్ ల పై అడ్డుకట్టలను తెంచుకొని మరి అందాలను అల్ మోస్ట్ ప్రదర్శించడంలో ఎప్పుడు ముందుంటుంది శృతి. మరి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆమెనే చెప్పింది.
ఇఖ అటువంటి సీన్స్ లో నటించడమే కాదు, సినిమా విడుదలయ్యాక వచ్చే విమర్శలను ఎదుర్కునేందుకు కూడా సిద్దంగా ఉండాలి.. ఓ సినిమా ఒప్పుకున్నామంటే అందులో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇవన్ని ఉంటాయి. కానీ, రోమాన్స్ గురించే మాట్లాడుతుంటారు. అయినా గ్లామర్ నాకు పుట్టుకతోనే వచ్చింది. సెక్సీ నేస్ కు, వల్గర్ కు తేడా ఏంటో నాకు బాగా తెలుసు. నా పరిధులు నేను ఎప్పుడూ దాటలేదు. అలా ఇంతవరకు అనిపించలేదు కూడా అని చెబుతుంది.
అంతే కాదు ప్రొఫెషన్ కమిట్ మెంట్ లో భాగంగానే అన్నింటితో పాటే శృంగార సన్నివేశాలు కూడా చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ లో ఇలాంటి వాటిని అసలు పట్టించుకోరు. నా ద్రుష్టిలో రోమాన్స్ సీన్స్, మిగిలిన ఎలిమెంట్స్ తో సమానమే. ఆ సన్నివేశాల్లో అలా నటించక తప్పదు అనుకున్నప్పుడు అలా చేయాల్సిందే. అందుకే ఆ సన్నివేశాల్లో వెకడుగు వేసే ప్రసక్తే ఉండదు, ఇక ఈవెంట్లకు వేసుకెళ్లే డ్రెస్సులు ఎక్స్ పోజింగ్ కోసం కాదు, అందరినీ ఆకట్టుకోవటం కోసమే అని అన్నీ ఓపెన్ గానే చెప్పేసింది శృతి.
Tags: shruti hasan about romance, actress shruti hasan about romance, shruti hasan about sex, shruti hasan about romance scenesshruti hasan hd hot picsshruti hasan picsshruti hasan photosshruti hasan hd imagesshruti hasan vedios

http://www.newspillar.com/post/shruti-hasan-about-romance