Saturday, January 7, 2017

                                                ఒకే కధ కోసం ఇద్దరు పోటీ..



సినిమా పిల్లర్- నందమూరి బాలకృష్ణ.. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల తరువాత ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి విడుదల కానున్న ఈ రెండు చిత్రాలపై ఈ ఇద్ద‌రు అగ్ర హీరోల ఫ్యాన్స్‌ తో పాటు టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో సైతం భారీ అంచ‌నాలు ఉన్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ఇక్క‌డితోనే కాదు వీరి నెక్ట్స్ సినిమా విష‌యంలో కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ త‌న రీ ఎంట్రీ మూవీ కోసం ముందుగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి స్టోరీని తెర‌కెక్కించాడు. ఈ టైటిల్‌ తో స్టోరీ లైన్ రెడీ చేయాల‌ని పరుచూరి సోదరులను కోరాడట. ప‌రుచూరి సోద‌రులు మంచి స్క్రిఫ్ట్ రెడీ చేశారు కూడా..అయితే కీల‌క సినిమా కోసం కొత్త క‌థ‌..అది హిస్టారిక‌ల్ స్టోరీతో రిస్క్ చేయ‌డం ఎందుక‌నుకున్న చిరు చివ‌ర‌కు కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమా రీమేక్‌ కు ఓకేచేశాడు.
ఇక బాల‌య్య హిస్టారిక‌ల్ మూవీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స్టోరీతో త‌న 100వ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు అటు చిరు త‌న 151వ సినిమా కోసం ఏదైనా కొత్త‌గా ట్రై చేయాల‌ని అనుకుంటుంటే…. ఇటు బాల‌య్య సైతం త‌న 101వ సినిమాను అదే స్టోరీతో చేయాల‌ని డిసైడ్ అయ్యి ప‌రుచూరి సోద‌రుల‌తో చ‌ర్చించాడ‌ట‌. ఈ విష‌యం చిరుకు తెలియ‌డంతో తాను ఎంతో ఇష్ట‌ప‌డి రాయించుకున్న క‌థ‌ను బాల‌య్య‌కు ఇవ్వ‌వ‌ద్ద‌ని వారిని రిక్వెస్ట్ చేశాడని సమాచారం. 
ఇంకేముంది అటు చిరు , ఇటు బాల‌య్య మ‌ధ్య‌లో ప‌రుచూరి సోద‌రులు న‌లిగిపోతున్నార‌ట‌. మ‌రి ఒకే క‌థ‌కోసం పోటీప‌డుతున్న ఈ టాలీవుడ్ అగ్ర‌హీరోల్లో ఎవ‌రు ఫైన‌ల్‌ గా ఈ క‌థ‌ను సొంతం చేసుకుంటారన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది


No comments:

Post a Comment