Tuesday, December 27, 2016

                                              మోస్ట్ వైరల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా.. 




లైఫ్ స్టైల్ డెస్క్- అందాల భామ ఊర్వశీ రౌతెలా మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో అరుదైన ఘనత దక్కించుకుంది. ఈ ఏడాది మోస్ట్‌ వైరల్‌ సెలబ్రిటీగా ఎంపికైంది. ఇటీవల జరిగిన రిలయన్స్‌ డిజిటల్‌ ఎగ్జిబిట్‌ టెక్‌ అవార్డులు 2016లో వేడుకలో ఈ అమ్మడు ఈ పురస్కారం అందుకుంది. గతంలో యమహా ఫాసినో మిస్ దివా- 2015 మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి ఆ తరువాత  పలు సినిమాల్లో నటించింది. 
ఇక ఈ ఏడాది జూలైలో విడుదలైన ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఈ సినిమా రిలీజ్ కు 17 రోజుల ముందే ఇంటర్నెట్‌ లో లీక్ అవడంతో కలకలం రేగింది. ఫలితంగా ఈ సినిమా వసూళ్లు ఊహించిన దానికన్నా చాలా తక్కువగా వచ్చాయి. దీనిపై అప్పట్లో ఊర్వశి కన్నీళ్లు పెట్టుకుంది. ‘సినిమా చూసిన వారందరూ చాలా బాగా నటించావని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదని తెగ బాధపడిపోయిందీ భామ.
Tags: urvasi routhela sexy girl, actress urvasi routhela sexy girl, urvasi routhela sexy women, urvasi routhela sexy viral urvasi routhela hd pics,urvasi routhela hd imagesurvasi routhela vediosurvasi routhela photos.

http://www.newspillar.com/post/urvasi-routhela-sexy-girl

Monday, December 19, 2016

                                             కాజల్ కోసం అంతగా వెతుకుతున్నారా..





సినిమా పిల్లర్- అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు ఉన్న సక్సెస్ ఫుల్ కేరీరే కాదు.. అసాదారణమైన అందం ఈ భామ సొంతం. పన్నెండేళ్ళ కెరీర్లో ఆమెకు ఉన్న క్రేజ్ లో ఏమాత్రం మార్పు లేదని చెప్పవచ్చు. రోజురోజుకు ఈనెరజాన అనుభవంతో పాటు ఆదరణ కూడా పెరుగుతుంది. కాజల్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ ఒక్క సూపర్ హిట్ సినిమాల రూపంలోనే కాదు, అవార్డులు, గుర్తింపులలోనూ తక్కువేంకాదు.
కాజల్ కు ఇప్పటికున్న గౌరవాలతో పాటు....ప్రస్తుతం మరో కొత్త గుర్తింపు దక్కింది. ఈ ఏడాది గూగుల్ లో వెతికిన తారల్లో మూడో స్థానంలో నిలిచింది ఈ అమ్మడు. సినీ ప్రియుల సెర్చ్ లో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి బాలీవుడ్ హీరోయిన్లను వెనక్కి నెట్టింది కాజల్. ప్రేక్షకులపై దక్షిణాది తారల ప్రభావం ఎంతగా ఉందో కాజల్‌ మరోసారి నిరూపించింది. ఒకటో స్థానంలో సన్నీ లియోన్‌, రెండో సెలబ్రిటీగా కత్రీనా కైఫ్‌ నిలవడం విశేషం.
http://www.newspillar.com/post/kajal-in-google-search

Thursday, December 15, 2016

                                            గూగుల్ లో అంతా ఆమె గురించే వెతికారట..

సినిమా పిల్లర్- ఈ సంవత్సరం ఇంటర్నెట్‌ లో అత్యధికంగా నెటిజన్లు వెతికిన వారి జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అధికారిక జాబితాను విడుదల చేసింది. గూగుల్ లో 2016 లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా మొదటి స్థానంలో నిలిచింది. ప్రియాంకతోపాటు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రె టాప్ గూగుల్ సెర్చ్ లిస్ట్‌ లో స్థఆనం సంపాదించింది.
ఇక తాజాగా బేవాచ్ ద్వారా హాలీవుడ్‌ లోకి ప్రవేశించిన ప్రియాంక ఆస్కార్ రెడ్ కార్పెట్ డ్రెస్సెస్ కేటగిరీలో ఫ్యాషన్ డిజైనర్‌ అనిల్ డోంగ్రే తోపాటు ఏడో స్థానంలో నిలవడం విశేషం. ఆస్కార్ రెడ్ కార్పెట్ డ్రెస్సెస్ కేటగిరీలో జెన్నిఫర్ గార్నర్ మొదటి స్థానంలో నిలవగా..జెన్నీఫర్ లారెన్స్ రెండో స్థానంలో నిలిచింది. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ ‘బేవాచ్‌’ త్వరలోనే విడుదల కానుంది.
http://www.newspillar.com/post/priyanka-no1-in-google-search

Thursday, December 8, 2016

                                                 ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేను..


సినిమా పిల్లర్- తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. కాని అది ఎప్పుడనేది చెప్పలేనంటోంది బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ.  క్రికెటర్ విరాట్ కోహ్లికి ఈమెకు మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న సంగతి అందరికి తెలిసిందే. మొన్న రాజ్ కోట్ లో జరిగిన టెస్ట్ కి కూడా అనుష్కతో కలసి విరాట్ రావడం.. యువరాజ్ సింగ్ పెళ్ళికి సైతం ఇద్దరు కలిసి వెళ్లడం గమనార్హం. పెళ్లి చేసుకుంటా...కానీ ఎప్పుడు అనేది నాక్కూడా తెలియదు. ఆ విషయం గురించే ఆలోచించలేదు. 
అందరి లాంటిదే నా జీవితం కూడా. తప్పకుండా పెళ్లి చేసుకుంటా...ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. పెళ్లైనా సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది. నేనైతే సాదారణ వ్యక్తిగా ఆలోచిస్తా. జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే జరుగుతుంది. దానికే మనం కట్టుబడి ఉండాలి. మహిళల ఆలోచనా విధానంలో మార్పుల వల్లే విడాకుల సంఖ్య పెరుగుతుందేమోనని అనిపిస్తోందని తనదైన స్తైల్లో చెప్పిందీ నెరజాన.
http://www.newspillar.com/post/anushka-sharma-about-marriage

Thursday, December 1, 2016

                                              ప్రెగ్నెన్సీతో ఉన్నా తగ్గని అమ్మడు..



సినిమా పిల్లర్-  బాలీవుడ్ అందాల స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తల్లి కాబోతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఎక్కడ తన ఫేవరేట్ హీరోయిన్ వెండితెరకు దూరమవుతుందోనని ఆందోళన చెందారు. అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా పలు ఈవెంట్స్ కి హాజరవుతూ, ర్యాంప్ వాక్ చేస్తూ ప్రేక్షకులకి కనువిందు చేస్తూనే ఉంది కరీనా. ప్రస్తుతం కరీనా థర్డ్ ట్రైమేస్టర్ లో ఉందట. .మరో ఒకటి, రెండు నెలల్లో పండంటి బీదను కనబోతోంది. 
తాజాగా ఆమె ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ చూసి ఫ్యాన్స్ ఆశ్తర్యపోయారు. ఓ బాస్ లెవల్ లో ఇచ్చిన బ్యూటీఫుల్ స్టన్నింగ్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ ని వివాహం చేసుకున్నాక కూడా కరీనా ఎన్నో సినిమాల్లో నటించింది. అమ్మతనంలోని ఆనందాన్ని అనుభవించాలని సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఈ భామ.. ఎప్పుడెప్పుడు తమ బిడ్డను ముద్దాదాలా అని ఎదురుచూస్తోంది, 
http://www.newspillar.com/post/kareena-kapoor-pregnancy-photo-shoot