Monday, December 19, 2016

                                             కాజల్ కోసం అంతగా వెతుకుతున్నారా..





సినిమా పిల్లర్- అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు ఉన్న సక్సెస్ ఫుల్ కేరీరే కాదు.. అసాదారణమైన అందం ఈ భామ సొంతం. పన్నెండేళ్ళ కెరీర్లో ఆమెకు ఉన్న క్రేజ్ లో ఏమాత్రం మార్పు లేదని చెప్పవచ్చు. రోజురోజుకు ఈనెరజాన అనుభవంతో పాటు ఆదరణ కూడా పెరుగుతుంది. కాజల్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ ఒక్క సూపర్ హిట్ సినిమాల రూపంలోనే కాదు, అవార్డులు, గుర్తింపులలోనూ తక్కువేంకాదు.
కాజల్ కు ఇప్పటికున్న గౌరవాలతో పాటు....ప్రస్తుతం మరో కొత్త గుర్తింపు దక్కింది. ఈ ఏడాది గూగుల్ లో వెతికిన తారల్లో మూడో స్థానంలో నిలిచింది ఈ అమ్మడు. సినీ ప్రియుల సెర్చ్ లో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి బాలీవుడ్ హీరోయిన్లను వెనక్కి నెట్టింది కాజల్. ప్రేక్షకులపై దక్షిణాది తారల ప్రభావం ఎంతగా ఉందో కాజల్‌ మరోసారి నిరూపించింది. ఒకటో స్థానంలో సన్నీ లియోన్‌, రెండో సెలబ్రిటీగా కత్రీనా కైఫ్‌ నిలవడం విశేషం.
http://www.newspillar.com/post/kajal-in-google-search

No comments:

Post a Comment