Thursday, December 15, 2016

                                            గూగుల్ లో అంతా ఆమె గురించే వెతికారట..

సినిమా పిల్లర్- ఈ సంవత్సరం ఇంటర్నెట్‌ లో అత్యధికంగా నెటిజన్లు వెతికిన వారి జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అధికారిక జాబితాను విడుదల చేసింది. గూగుల్ లో 2016 లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా మొదటి స్థానంలో నిలిచింది. ప్రియాంకతోపాటు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రె టాప్ గూగుల్ సెర్చ్ లిస్ట్‌ లో స్థఆనం సంపాదించింది.
ఇక తాజాగా బేవాచ్ ద్వారా హాలీవుడ్‌ లోకి ప్రవేశించిన ప్రియాంక ఆస్కార్ రెడ్ కార్పెట్ డ్రెస్సెస్ కేటగిరీలో ఫ్యాషన్ డిజైనర్‌ అనిల్ డోంగ్రే తోపాటు ఏడో స్థానంలో నిలవడం విశేషం. ఆస్కార్ రెడ్ కార్పెట్ డ్రెస్సెస్ కేటగిరీలో జెన్నిఫర్ గార్నర్ మొదటి స్థానంలో నిలవగా..జెన్నీఫర్ లారెన్స్ రెండో స్థానంలో నిలిచింది. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ ‘బేవాచ్‌’ త్వరలోనే విడుదల కానుంది.
http://www.newspillar.com/post/priyanka-no1-in-google-search

No comments:

Post a Comment