Saturday, January 7, 2017

                                           చరణ్.. మా వదిన నిర్మాణంలో సినిమా..




సినిమా పిల్లర్- ఎట్టకేలకు అన్న సినిమాపై తమ్ముడు స్పందించాడు.. అదేనండి చిరంజీవి ఖైదీ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. ఇప్పటి వరకు మెగాస్టార్ రీ ఎంట్రీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవన్ తాజాగా ఖైదీ నంబర్ 150 యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపాడు. చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనస్పూర్తిగా శుభాకాంక్షలు'. అంటూ ట్వీట్ చేశాడు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమా వేడుకకు తాను వచ్చేదీ రానిదీ క్లారిటీ ఇవ్వలేదు. నిన్న సాయంత్రం నుంచి పవన్ ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ స్వయంగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారంటున్నారు అభిమానులు. పనవ్ మాత్రం తన ట్వీట్ లో ఎక్కడా వేడుకకు సంబంధించి స్పందించకపోవటంతో మరోసారి అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
Tags: pawan tweet about khaidi, pawan tweet about khaidi movie, pawan tweet about khaidi 150, pawan tweet about khaidi cinema, Power star pics, megastar pics, pavan kalyan, chiranjeevi, chiranjeevi 150 movie, pavan kalyan movies, khaidi no 150, khaidi no 150 movie.

http://www.newspillar.com/post/pawan-tweet-about-khaidi

No comments:

Post a Comment