రోబో 2.0 ఫస్ట్ లుక్ విడుదల
రోబో సిరీస్ గా చిత్రీకరిస్తున్న రోబో 2.0 ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంతం , శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న రోబో 2.0 ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ముంబై లోని యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో ఈపోస్టర్ ను విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న రోబో 2.0 సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో విడుదల చేశారు. పోస్టర్ లో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించే ఫోటోను కూడా ప్రింట్ చేశారు.
రొటీన్ సినిమాలకు బిన్నంగా ఆధునిక సాంకేతికతతో వచ్చిన రోబో 1 ఎంత ఘణవిజయం సాదించిందో అందరికి తెలుసు. దాంతో రజనీ అభిమానుల్లో రోబో 2.0 పైన చాలా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఫిబ్రవరి, మార్చ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. రోబో 1 లో ఐశ్వర్య రాయ్ ప్లేస్ లో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే
http://www.newspillar.com/post/robo-2-0-first-look-release
No comments:
Post a Comment