Friday, November 18, 2016

                                                     ఆమెను అదృష్టం పట్టి పీడిస్తోంది.. 
                    




సినిమా పిల్లర్- అందాల కేరళ భామ కీర్తి సురేష్ సంతోషం అంతా ఇంతా కాదు. ఓ వైపు హిట్స్ ఇస్తున్న జోష్ ఐతే, మరోవైపు పెద్ద ప్రాజెక్ట్ లో యాక్ట్ చేసే అవకాశం, అంతే కాదు రోజు రోజుకి పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. కెరీర్ ప్రారంభంలో ఉన్న హీరోయిన్ కి ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి.
ఇక ఇప్పుడు ఆ జాయ్ ఫుల్ మూడ్ లో తెగ ఆనందపడిపోతోంది కీర్తీ. ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ సంఖ్య యాభై లక్షలు చేరడంతో పండగ చేసుకొంటుంది. ఒకప్పుడు సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం సినిమా వాళ్లకి ఎంత క్రేజ్ ఉన్నదో చెప్పడానికి సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో అవుతున్న ఫ్యాన్ బేస్ బట్టే బేరీజు వేస్తున్నారు.
ట్విట్టర్...ఫేస్ బుక్...ఇన్ స్టా గ్రామ్ లో గ్రాఫ్ దాటినప్పుడల్లా ఫాలోవర్స్ అందరికి ఓ థాంక్స్ చెబుతూ స్పెషల్ గా ఓ డిజైన్ చేసిన పోస్ట్ పెట్టేస్తున్నారు. ఫేస్ బుక్ పేజీలో కీర్తీని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య 50 లక్షలు దాటేసింది. మొన్ననే కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తీ అతి తక్కువ కాలంలోనే 50 లక్షలమందిని ఫాలోవర్స్ గా మారారంటే అదృష్టమే మరి.
http://www.newspillar.com/post/keerthi-suresh-fallowers-in-face-book

No comments:

Post a Comment