Friday, November 18, 2016

                                        ఈ హీరోయిన్ ను గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా.?


ముంబై :  సినిమాల్లో న‌టించిన‌ప్పుడు హీరోయిన్ లు నాజూక్కా క‌నిపిస్తారు. మానేసిన త‌ర్వాత గుర్తు ప‌ట్ట‌నంత‌గా మారిపోతారు. దివ్య‌వాణి, రాధ‌, ఖుష్బూ లు ఇలా చాలా మంది త‌మ అందంతో కుర్రాల్ల మ‌తి పోగొట్టిన హీరోయిన్లు త‌ర్వాత లావెక్కి ఎలా మారిపోయారో చూశాం. ఇప్పుడు ఆ పైన క‌నిపిస్తున్న ఫోటో శిల్పా శిరోద్క‌ర్ .. ఈమె కూడా అదే కోవ‌లో చేరిపోయింది. 
ఒకప్పుడు నాజూగ్గా బాపు బొమ్మలా నాజూకు సోయగాలతో కుర్రాళ్ల మతి పోగొట్టిన శిల్పా ఇప్పుడు బాగా లావైపోయి షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు అక్క అయిన శిల్ప తెలుగులో ‘బ్రహ్మ’ సినిమాతో మన ప్రేక్షకులకు ద‌గ్గ‌రైంది. బాలీవుడ్లో ‘బ్రష్టాచార్’ సినిమతో కథానాయికగా పరిచయమైన శిల్ప.. ఆ తర్వాత కిషన్ కన్హయ్య.. త్రినేత్ర..హమ్.. ఖుదాగవా.. ఆంఖే.. పెహ్ చాన్.. బేవఫా సనమ్.. మృత్యుదండ్ లాంటి సినిమాల్లో నటించింది.
చివరగా మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో ఎంఎఫ్ హుస్సేన్ రూపొందించిన ‘గజగామిని’లో ఓ కీలక పాత్ర పోషించిన శిల్ప.. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. చాలామంది సౌత్ హీరోయిన్ల లాగే ఆపై టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. జీ టీవీ.. స్టార్ ప్లస్ లాంటి ఛానెళ్లలో కొన్ని సీరియళ్లలో నటిస్తూ కాలం వెళ్లదీస్తోంది శిల్ప.
http://www.newspillar.com/post/identify-this-heroine

No comments:

Post a Comment