Saturday, November 26, 2016

                                                   విప్లవ శిఖరం కూలిపోయింది..



ఇంటర్నేషనల్ డెస్క్- విప్లవ యోధుడు.. క్యూబా మాజీ అధ్యక్షులు ఫిడెల్‌ క్యాస్ట్రో కాసేపటి క్రితం మరణించారు. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌ లో జన్మించిన క్యాస్ట్రో 1959 నుంచి 1976 వరకూ క్యూబా ప్రధానిగా పనిచేశారు. ఆ తరువాత 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా దేశానికి మార్గనిర్దేశనం చేశారు. 1959లో ఫుల్జెన్సియో బతిస్టాలో మిలటరీ ఆధిపత్యాన్ని కూలదోసిన క్యాస్ట్రో పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నారు. 
ఇక క్యూబాను దాదాపు 5 దశాబ్దాల పాటు పాలించిన ఫిడెల్ క్యాస్ట్రో 2006లో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పార్టీ అధ్యక్ష పదవితో పాటు దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమ్ముడు రౌల్‌ కు బాధ్యతలు అప్పజెప్పారు. తుది శ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణ కోసం కృషి చేశారు.

http://www.newspillar.com/post/fidel-castro-died

No comments:

Post a Comment