అవును.. చాలా మందితో డేటింగ్ చేశాను..
సినిమా పిల్లర్- ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం కొంతమంది సెలబ్రిటీలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత ఓపెన్ గా ఉన్నా...డేటింగ్ గురించి మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు మాత్రం చాలా తక్కువ అని చెప్పక తప్పదు. అటువంటి వారిలో బాలీవుడ్ సెక్సీ భామ విద్యాబాలన్ ఒకరు. తాజాగా ఈ భామ తన వ్యక్తిగత విషయాల్ని ఓపెన్ గా చెప్పింది.
అందాల భామ విద్యాబాలన్ మాత్రం అందుకు భిన్నంగా తనకు సంబందించిన విషయాన్నీ ఓపెన్ గా చెప్పేసింది. తన భర్త సిద్ధార్థకంటే ముందే తాను కొందరితో డేటింగ్ చేసినట్లు చెప్పింది. 'కొందరితో నేను డేటింగ్ చేసినా… నాకు ఎవరూ నచ్చలేదు. దీంతో ఒంటరిగా ఉంటేనే సుఖం అని అనుకున్నా. అలా అనుకొని జీవిస్తున్న సమయంలో సిద్ధార్థరాయ్ కపూర్ పరిచయమయ్యారు. వ్యాపారవేత్త అయిన ఆయనతో మూడేళ్లు డేటింగ్ చేశాను. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పను కానీ… మెచ్యూర్డ్ లవ్ అని నిస్సంకోచంగా చెప్పిందీ నెరజాన.
http://www.newspillar.com/post/vidyabalan-about-dating
No comments:
Post a Comment