Friday, November 18, 2016

News Pillar- Telugu News Channel

                                      

బెడ్ రూంలోకి వెళ్తూ దొరికిపోయిన వైయస్ జగన్..



సినిమా పిల్లర్- అక్కినేని వారసుడు సుమంత్ తెలుసుకదా.. ఆ మధ్య సినిమా రంగంలోకి అరంగేట్రం చేసి.. అంతగా సక్సెస్ కాకపోవడంతో తెరమరుగయ్యాడు. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన నరుడా డోనరుడా సినిమాతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్న ఆయన రోజూ ఏదో ఒక చానల్ లో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు చెబుతున్నాడు సుమంత్. 
ఇందులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తాను మంచి మిత్రులమని చెబుతూ తామిద్దరం క్లాసుమేట్లమని కూడా చెప్పాడు. సుమంత్ తన స్కూల్ డేస్ లో చేసిన పనులను గుర్తు చేసుకుని మరీ చెప్పుకొచ్చాడు. ఒకసారి జగన్ తో కలసి దొంగతనంగా తన బెడ్ రూంలోకి వెళ్లబోతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా దొరికిపోయామని ఆయన చెప్పాడు సుమంత్. సుమారు 25 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన గురించి చెబుతూ... తాను జగన్ ఒకే క్లాసులో ఒకే బెంచీలో కూర్చుని చదివామని కలసి అల్లరి చేశామని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఓ రోజు రాత్రి పొద్దుపోయే వరకూ కలిసి తిరిగామని ఆపై జగన్ తన ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతూ పైనున్న బెడ్ రూమ్ కు దొంగతనంగా వెళ్లేందుకు తాను మొదట గ్రిల్ పట్టుకుని ఎక్కుతుండగా తాతయ్య చూశారని చెప్పాడు. ఆ సమయంలో గ్రిల్ పట్టుకుని వేలాడుతూనే తాతా... అతని పేరు జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి అంటూ పరిచయం చేశానని చెప్పుకొచ్చాడు. మరి వీరిద్దరి స్నేహం గురించి జగన్ ఎలా స్పందిస్తారో..
 See more at: http://www.newspillar.com/post/sumanth-about-ys-jagan




No comments:

Post a Comment