సినిమా విడుదల కాకుండానే అవకాశాల వెల్లువ..
సినిమా పిల్లర్- ఆమె తమిళంలో చేస్తున్నది మొదటి సినిమా.. ఇక ఆ సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు. ఈ సినిమాలో నటిస్తోంది అందాల భామ మేఘా ఆకాష్. ఒరు పాక్క కథై అనే సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఇప్పుడు ఈ అమ్మడు మరో క్రేజీ చాన్స్ కొట్టేసింది.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న తమిళ సినిమాకి మేఘాను హీరోయిన్ గా తీసుకున్నారు. అదే సమయంలో నితిన్ హీరోగా హను రాఘవాపుడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా మేఘానే హీరోయిన్ అంటున్నారు.
మరోవైపు అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమాలో మేఘాను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అఖిల్ సినిమా కూడా మేఘా ఖాతాలో పడితే ఈ ముద్దుగుమ్మ స్టార్ తిరిగినట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చరుగుతోంది.
Tag: megha-aakash pics
http://www.newspillar.com/post/megha-aakash-film-offers
No comments:
Post a Comment